: అర్ధరాత్రి చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు
తుపాను సహాయక చర్యలను పరుగులు పెట్టించేందుకు విశాఖలోనే మకాం వేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో అధికారులకు, ప్రభుత్వ సిబ్బందికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గత అర్ధరాత్రి ఆయన విశాఖలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు. ఆంధ్రా యూనివర్శిటీ, సీబీ ఆసుపత్రి సెంటర్ తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా చూసి, అధికారులకు పలు సూచనలు చేశారు. రాత్రి పూట కూడా పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు.