: నల్లధనం వ్యవహారంపై మోడీకి హజారే లేఖ
భారత్ కు చెందిన నల్లధనం కుబేరుల పేర్లను బయటకు వెల్లడించలేమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తో కేంద్ర ప్రభుత్వం పలువురి నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా ఈ అంశంపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆశ్చర్యం వక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆయన లేఖ రాశారు. "ఎన్నికల్లో నల్లధనం విషయంపై హామీ ఇచ్చినట్టుగా... ఈ విషయంలో చట్టపరమైన సమస్యలు ఉంటే తప్పకుండా ఆలోచించాలి" అని చెప్పారు. అయితే, స్విస్ బ్యాంక్ లో ఖాతాలు ఉన్న వారి పేర్లు తెలిపేందుకు ప్రభుత్వం చూపుతున్న అసమర్థతపై హజారే షాక్ కు గురయ్యారు. కాగా, "ఐదు నెలల్లో మోడీ ప్రభుత్వం లోక్ పాల్ నియామకం, బ్లాక్ మనీ విషయాలపై ఏదీ పూర్తిగా చేయలేదు. 'కరప్షన్ ఫ్రీ ఇండియా' నినాదంపై ప్రజలు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేయడం మొదలుపెడతారు. అది కేవలం ఎన్నికల టెక్నిక్కేనా అనుకుంటారు. ఈ విషయాలను భారతదేశ ప్రజలు చాలా అనుభవంతో గమనిస్తుంటారు" అని లేఖలో హజారే అసంతృప్తి వ్యక్తం చేశారు.