: మా నేతలపై లాఠీ ఛార్జ్ చేయడం అత్యంత ఘోరం: జానారెడ్డి
కరీంనగర్ లో రైతుల సమస్యలపై ధర్నా చేస్తున్న తమ నేతలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం అత్యంత ఘోరమని తెలంగాణ శాసనసభాపక్ష నేత, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ ముందుకు రాకపోవడం విచారకరమని అన్నారు. టీఆర్ఎస్ నేతలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచి రైతు సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.