: మధ్యాహ్నం 3.30 గంటల తర్వాతే... జయ విడుదల


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 గంటల మధ్య శుభ గడియలు లేని కారణంగానే జయలలిత ఈ మేరకు నిర్ణయించుకున్నారట. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగళూరు పరప్పన అగ్రహార ప్రత్యేక కోర్టు జయలలితతో పాటు ఆమె ముగ్గురు అనుచరులకు సంబంధించిన రిలీజ్ ఆర్డర్లను ఇప్పటికే జారీ చేసింది. అయితే శుభ గడియలు లేని కారణంగానే ఆమె మధ్యాహ్నం 3.30 గంటల దాకా జైలు నుంచి బయటకు రాకూడదని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే, ఉదయమే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం సహా, మంత్రి మండలి మొత్తం పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి చేరుకుని ఎప్పుడెప్పుడు జయ బయటకు వస్తారా అని ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News