: బిసిసిఐ భారీ నష్టాలను ఎదుర్కొంటోంది: కార్యదర్శి సంజయ్ పటేల్


టీమిండియాతో ఒప్పందం చేసుకున్న ఐదు వన్డేల సిరీస్ నుంచి వెస్ట్ ఇండీస్ అర్థంతరంగా నిష్క్రమిస్తుండటంతో బీసీసీఐకు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశం కాస్తా బీసీసీఐ బోర్డుకు నష్టాలను తెచ్చిపెట్టిందని కార్యదర్శి సంజయ్ పటేల్ చెబుతున్నాడు. ఈ మేరకు మాట్లాడుతూ, "భారత్ టూర్ ను వెస్టిండీస్ ఆటగాళ్లు అనూహ్యంగా ఉపసంహరించుకోవడంవల్లే భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాం. ఈ నష్టాలన్నింటినీ కోరుతూ విండీస్ బోర్డుపై దావా వేస్తాం. ఐసీసీతో చర్చించి ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకుంటాం. ఈ సమస్యను వెంటనే అధిగమించేందుకు శ్రీలంక బోర్డుతో మాట్లాడాం. చివరికి భారత్ తో సిరీస్ ఆడేందుకు తక్కువ సమయంలో ఒప్పించాం" అని సంజయ్ వివరించారు.

  • Loading...

More Telugu News