: పాలకులు మారితే కులాలు మారతాయా? పింఛను కోసం భర్త పోయారని చెప్తారా?: టీపీసీసీ చీఫ్


పాలకులు మారినంత మాత్రాన ప్రజల కులాలు మారతాయా? అని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వితంతు పింఛన్ల కోసం ఎవరైనా భర్త పోయాడని అబద్ధం చెబుతారా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. రేషన్ కార్డులు, పింఛన్ల పేరిట తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తే వారు నిలదీస్తారని, లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని పొన్నాల హితవు పలికారు.

  • Loading...

More Telugu News