: తన కుటుంబ సభ్యులకు తప్ప కేసీఆర్ ఎవరికీ మేలు చేయరు: డీఎస్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ మేలు చేయరని కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ తెలిపారు. కరీంనగర్ లో రైతు భరోసా యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ పచ్చి మోసకారి అని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పేవరకు రైతుల సమస్యలపై తాము ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గోదావరి దాటి నాలుగడుగులు వేస్తే ఛత్తీస్ గఢ్ నుంచి కరెంటు వస్తుందని చెప్పి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. కరెంటు సమస్యలపై కేసీఆర్ ను అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News