: దీని ముందు ఆమెరికా క్షిపణులు దిగదుడుపే!
సుదూర తీర లక్ష్యాలను ఛేదించడంలో అమెరికా క్షిపణులకు మంచి పేరుంది. ఇప్పుడు వాటన్నింటికంటే ఎంతో ఉత్తమమైన క్షిపణిని భారత్ తయారు చేసిందని శాస్త్రవేత్త సతీష్ తెలిపారు. చాందీపూర్ క్షిపణి ప్రయోగ కేంద్రం నుంచి ఆయన మాట్లాడుతూ, సుదూర లక్ష్యాలను ఛేదించడంలో 'నిర్భయ్' క్షిపణి కంటే మెరుగైనది లేదంటే అతిశయోక్తి కాదని అన్నారు. ఈ క్షిపణి అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ లక్ష్యాలను ఛేదిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సముద్రంలోని అలలకు కేవలం 5 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ గమ్యాన్ని ఛేదిస్తుందని ఆయన వెల్లడించారు. 16 పాయింట్లను టచ్ చేస్తూ వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సమర్ధవంతంగా ఛేదిస్తుందని ఆయన వివరించారు.