: కాశీ విశ్వనాథ ఆలయ పూజారికి ఇదేం బుద్ధి?


వారణాసిలో కాశీ విశ్వనాథుడి ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పనవసరంలేదు. అయితే, గణపత్ ఝా అనే పూజారి ఆ దేవస్థాన ప్రతిష్ఠను మంటగలిపాడు. ఇద్దరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. ప్రస్తుతం అతడు బెయిల్ పై బయటికొచ్చాడు. వివరాల్లోకి వెళితే... సెప్టెంబరు 26న ఈ గణపత్ ఝా ఇద్దరు మహిళా భక్తులతో అనుచితంగా ప్రవర్తించాడంటూ ఆలయ సీఈఓ అజయ్ కుమార్ అవస్థికి అక్టోబరు 13న ఎవరో సమాచారమందించారు. ఆలయ ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగిందట. దీన్ని సీరియస్ గా తీసుకున్న సీఈఓ వెంటనే సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా, గణపత్ ఝా నిర్వాకం బయటపడింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఝాకు నోటీసులు పంపినా బదులు లేకపోవడంతో, చౌక్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దాంతో, అతడిని అరెస్టు చేశారు పోలీసులు. దీనిపై, పూజారి బంధువులు మాట్లాడుతూ, ఝా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసిన కుట్ర ఇదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News