: ట్విట్టర్లో ఇక ఐట్యూన్స్ వినొచ్చు


ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్లో ఇకపై ఐట్యూన్స్ తో పాటు ఇతర ట్రాక్స్ కూడా ప్లే చేసుకోవచ్చు. యూజర్లు ఆడియో క్లిప్స్, ట్రాక్స్ ను నేరుగా తమ టైమ్ లైన్ నుంచి కానీ, మెసేజ్ ఫీడ్స్ నుంచి కానీ ప్లే చేయవచ్చు. ఈ మేరకు ట్విట్టర్ ఆడియో స్ట్రీమింగ్ సేవల సంస్థ సౌండ్ క్లౌడ్ తో కలిసి 'ఆడియో కార్డ్' పేరిట సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఐట్యూన్సే కాకుండా, సౌండ్ క్లౌడ్ భాగస్వామ్య సంస్థలకు చెందిన ట్రాక్స్ ను కూడా ప్లే చేసుకునే సౌలభ్యం ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం ద్వారా భారీ స్థాయిలో మ్యూజిక్ కంటెంట్ ను యూజర్లకు అందుబాటులోకి తెస్తామని ట్విట్టర్ తెలిపింది. ఈ వివరాలను ట్విట్టర్ తన బ్లాగులో పేర్కొంది.

  • Loading...

More Telugu News