: కేబినెట్ విస్తరణ కసరత్తులో కేసీఆర్!


తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు సంబంధించిన కసరత్తును టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన గురువారం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. ప్రతి జిల్లాకు తన కేబినెట్ లో ప్రాతినిథ్యం ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పే కేసీఆర్ కేబినెట్ లో ప్రస్తుతం మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చోటుదక్కలేదు. దీంతో ఈ జిల్లాలకు చెందిన ఒకరిద్దరికి కేబినెట్ లో చోటు కల్పించడంతో పాటు ఇటీవలే పార్టీలోకి చేరిన పలువురు ఇతర పార్టీల నేతలకు కూడా అవకాశం కల్పించాలన్న దిశగా ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం. మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావులకు విస్తరణలో మంత్రి పదవులు దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి పార్టీలోకి చేరిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు కూడా మంత్రి పదవిపై హామీ ఇచ్చిన కేసీఆర్, తొలి విస్తరణలోనే అవకాశం కల్పిస్తారా? అన్నది చూడాలి!

  • Loading...

More Telugu News