: బంగారు తెలంగాణ అంటే క్యూలో నిలబెట్టి ప్రజలను చంపడమా?: కిషన్ రెడ్డి


బంగారు తెలంగాణ అంటే క్యూలో నిల్చోబెట్టి ప్రజలను చంపడమా? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పింఛను లబ్దిదారులెవరో తెలుసుకోవాలంటే ప్రస్తుతమున్న రికార్డుల ఆధారంగా తనిఖీలు చేస్తే సరిపోదా? అని నిలదీశారు. దానికి పించన్ల కోసం కొత్త దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నారో వివరించాలని ఆయన అడిగారు. సంక్షేమ పథకాలు నీరుగార్చేందుకే ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన మండిపడ్డారు. కరెంటు విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచన కేసీఆర్ కు ఉన్నట్టు లేదని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News