: మరణించి ఐదేళ్లయినా ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఆయనే నెంబర్ వన్
మరణించి ఐదేళ్లయినా ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో మైఖేల్ జాక్సన్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు. ఆయన ఎస్టేట్, వన్నె తరగని ఆయన ఆల్బమ్స్ ద్వారా మైఖేల్ జాక్సన్ కు ఏటా 141 మిలియన డాలర్ల ఆదాయం సమకూరుతోంది. దీంతో ఫోర్బ్స్ కీర్తిశేషుల జాబితాలో రెండోసారీ ఆయనే అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో ఎల్విస్ ప్రెస్లీ ఉన్నారు. ఎల్విస్ ప్రెస్లీకి ఏటా 55 మిలియన్ డాలర్ల సంపాదన వస్తోంది. తృతీయ స్థానంలో కార్టూనిస్ట్, పీనట్ కామిక్ సృష్టి కర్త ఛార్లెస్ షుల్జ్ ఉన్నారు. ఆయన పేరిట ఏటా 40 మిలియన్ డాలర్ల సంపాదన సమకూరుతోంది. దీంతో వీరు ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.