: 55 విద్యుత్ టవర్లు, పెందుర్తి, గరివిడి సబ్ స్టేషన్లు రెడీ అయినట్టే: ఎపీ ట్రాన్స్ కో సీఎండీ
హుదూద్ తుపాను విద్యుత్ శాఖను తీవ్ర కష్టాల్లో పడేసింది. తుపాను కారణంగా విద్యుత్ శాఖ భారీ స్థాయిలో నష్టపోయింది. అయినప్పటికీ మనోనిబ్బరంతో పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది. దీంతో, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ దిశగా 90 శాతం పనులు పూర్తయినట్టు ఏపీ ట్రాన్స్ కో సీఎండీ విజయానంద్ తెలిపారు. మొత్తం 55 విద్యుత్ టవర్లను పునరుద్ధరించామని ఆయన తెలిపారు. పెందుర్తి సబ్ స్టేషన్ పనులు పూర్తికాగా, గరివిడి సబ్ స్టేషన్ పనులు రాత్రికల్లా పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం 8 వేల మంది సిబ్బంది అహరహం శ్రమించారని ఆయన ప్రశంసించారు.