: మరో కక్ష్య ప్రాంతంలోకి మంగళయాన్
గత నెల 24న అంగారక క్షక్ష్యలోకి ప్రవేశించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ను ఇస్రో మరో కక్ష్య ప్రాంతంలోకి మార్చింది. 'సైడింగ్ స్ప్రింగ్' అనే తోకచుక్క ఈ నెల 19న అరుణ గ్రహానికి దగ్గర్లోకి వస్తుందన్న సమాచారం నేపథ్యంలో మంగళయాన్ క్షక్ష్య స్థితిని మార్చింది. "మార్స్ ఆర్బిటర్ ను మేము వేరే స్థానంలోకి మార్చాం. ఎందుకంటే మరి కొద్ది రోజుల్లో 'సైడింగ్ స్ప్రింగ్' తోకచుక్క మార్స్ కు దగ్గరలోకి రాబోతోంది. కాబట్టి ఆర్బిటర్ పొజిషన్ ను తొకచుక్క నుంచి దూరంగా తీసుకునివెళ్లాం. దానివల్ల ఉపగ్రహానికి ఎలాంటి ప్రభావం ఉండదు" అని అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. మరోవైపు మార్స్ పైకి ఉపగ్రహాలను పంపిన ఇస్రో, నాసా సహా ప్రపంచంలోని ఇతర స్పేస్ ఏజెన్సీలు కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.