: 'ఐఎస్ఐఎస్'పై పోరుకు అమెరికా పెట్టుకున్న పేరు ఇదే
ఇరాక్, సిరియా దేశాల్లో ప్రబలిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపుపై పోరాటానికి 'ఆపరేషన్ ఇన్హరెంట్ రిసాల్వ్'గా అమెరికా నామకరణం చేసింది. సద్దాం హుస్సేన్ ను తుదముట్టించడానికి ఉద్దేశించిన 'ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్'లా పేరులో గాంభీర్యం ఉట్టిపడకున్నా, సంకల్ప బలం రీత్యా 'ఇన్హరెంట్ రిసాల్వ్' కూడా శక్తిమంతమైన పోరాటమేనని అమెరికా వర్గాలంటున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే మధ్య ప్రాచ్యంలో అమెరికా ఆపరేషన్ డెజర్ట్ షీల్డ్, డెజర్ట్ స్టార్మ్, డెజర్ట్ ఫాక్స్ అంటూ ఎన్నో పోరాటాలు చేసింది. ఈ పర్యాయం కూడా ఆ తరహాలోనే నామకరణం చేస్తారని భావించినా, అధ్యక్షుడు బరాక్ ఒబామా తనదైన శైలిలో 'ఆపరేషన్ ఇన్హరెంట్ రిసాల్వ్'నే ఖరారు చేశారట.