: ఐఎస్ఎల్ లో కోహ్లీ జట్టుపై ధోనీ టీందే పైచేయి!
ఐపీఎల్ లోనే కాదండోయ్, ఐఎస్ఎల్ లోనూ టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ విజయాల బాటలో జైత్ర యాత్ర కొనసాగిస్తున్నాడు. ఇక మునుపటి ఫామ్ ను పాదుకొల్పుకునేందుకు టీమిండియా వైస్ కెప్టెన్ కోహ్లీ చేస్తున్న యత్నాల మాదిరే అతడి ఐఎస్ఎల్ జట్టు కూడా బుధవారం నాటి పోటీలో చిత్తుగా ఓటమిపాలైంది. ఇండియన్ సూపర్ లీగ్ పోటీల్లో భాగంగా బుధవారం ధోనీ నేతృత్వంలోని చైన్నయన్, కోహ్లీ నేతృత్వంలోని గోవా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నయన్ జట్టు 2-1 స్కోరుతో గోవా జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ టోర్నీలో చెన్నయన్ తరఫున తొలి గోల్ చేసిన బల్వంత్ సింగ్, టోర్నీలో తొలి గోల్ కొట్టిన భారత క్రీడాకారుడిగా నిలిచాడు.