: మరాఠాలు నన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారు: గోపీనాధ్ ముండే కుమార్తె


మహారాష్ట్ర ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని దివంగత బీజేపీ నేత గోపీనాధ్ ముండే కుమార్తె పంకజా ముండే తెలిపారు. బీడ్ జిల్లాలోని పార్లీ నియోజకవర్గంలో ఓటువేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, మరాఠాలు తన తండ్రి గోపీనాధ్ ముండేను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారని అన్నారు. ఆయన అకాల మరణంతో తనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే తనకు ముఖ్యమంత్రి పీఠంపై ఆశలేదని, మహారాష్ట్రలో బీజేపీ పటిష్టతకు కృషి చేస్తానని, పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పని చేస్తానని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News