: పెళ్లి పనుల్లో నటి దియా మీర్జా
బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ఇందుకోసం షాపింగ్, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన విషయాల్లో మునిగిపోయింది. అందుకే ఈసారి మహారాష్ట్రకు జరుగుతున్న ఎన్నికలకు ఓటు వేయడం మిస్ అయ్యానని ట్విట్టర్ లో తెలిపింది. లేకుంటే తప్పకుండా ఓటు వేసేదాన్నని చెప్పింది. నిర్మాత సాహిల్ సంఘాతో ఈ నెల 18న ఢిల్లీలో దియా పెళ్లి జరగనుంది. పూర్తి ప్రైవేట్ సెర్మనీగా జరగనున్న ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరవనున్నారు. ఆ తరువాత బాలీవుడ్ స్నేహితులకు గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనుంది. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న దియా, సాహిల్ లకు ఈ ఏడాది ఏప్రిల్ లో న్యూయార్కులో ఎంగేజ్ మెంట్ జరిగింది.