: చొక్కా పట్టుకున్నాడని, బుల్లెట్లు దింపిన ఎస్సై


తమిళనాడులో ఓ సబ్ ఇన్ స్పెక్టర్ క్షణికావేశంలో వ్యక్తిని బలిగొన్నాడు. రామనాథపురం జిల్లాలో జరిగిందీ ఘటన. ఎస్ పీ పత్తినం గ్రామంలో ఓ దుకాణదారు ఫిర్యాదు మేరకు సయ్యద్ మహ్మద్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించాడు ఎస్సై కాళిదాస్. దుకాణదారుడితో స్వల్పంగా గొడవపడడమే మహ్మద్ చేసిన నేరం! పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన మహ్మద్ ను ఎస్సై గద్దించాడు. ఓ దశలో సర్వీస్ పిస్టల్ చూపి బెదిరించాడు. దీంతో, మహ్మద్ ఆవేశంగా ఎస్సై కాళిదాస్ షర్టు పట్టుకున్నాడు. ఇంకేముంది, ఆ సబ్ ఇన్ స్పెక్టర్ విచక్షణ కోల్పోయాడు. వెంటనే పిస్టల్ ను మహ్మద్ కు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్చాడు. దీంతో, ఆ అభాగ్యుడు అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన జిల్లా ఎస్పీ మయిల్ వాహనన్ ఆ ఎస్సైని వెంటనే సస్పెండ్ చేశారు. దీనిపై నివేదికను జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కు పంపనున్నారు.

  • Loading...

More Telugu News