: ఆదాయంలో దూసుకుపోతున్న నవ్యాంధ్రప్రదేశ్
రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జోరందుకున్నాయి. దీంతో, రాష్ట్రం విడిపోయిన మూడు నెలల్లోనే (జులై నుంచి సెప్టెంబర్ వరకు) స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. వీటి ద్వారా సెప్టెంబరులో రూ. 255 కోట్లు, ఆగస్టులో రూ. 213 కోట్లు, జులైలో రూ. 250 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే పన్నుల ద్వారా కేవలం సెప్టెంబరు నెలలోనే రూ. 2,747 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ వరకు రూ. 24,070 కోట్లను ఏపీ ప్రభుత్వం ఆర్జించింది. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో 58 శాతం మేర లెక్కకడితే ఏపీకి వచ్చిన ఆదాయం రూ. 22,557 కోట్లు ఆదాయం మాత్రమే. కీలకమైన హైదరాబాద్ రెవెన్యూ లేకపోయినప్పటికీ... ఆదాయంలో ఏపీ దూసుకుపోతోందని చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. రాబోయే రోజుల్లో ఈ రెవెన్యూ మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.