: మరింత క్షీణించిన 'టోకు ధరల ద్రవ్యోల్బణం'
కూరగాయల ధరలు క్షీణించడం, ఇతర ఆహార వస్తువుల ధరలు కూడా పతనమవడంతో టోకు ధరల ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో సెప్టెంబర్ లో ద్రవ్యోల్బణం 2.38 శాతం వద్ద స్థిరపడింది. గతేడాది ఇదే నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 7.05 కంటే మరింత తక్కువగా ఉండటం గమనార్హం. ఆగస్టులో ఈ ద్రవ్యోల్బణం 3.75 శాతం ఉందని 'టోకు ధరల సూచీ' (హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్) లెక్కించింది. అంతేగాక ఐదేళ్ల దిగువకు అంటే 2009 అక్టోబర్ లో 1.8 శాతం నమోదైన ద్రవ్యోల్బణానికి దగ్గరలో పడిపోయిందని తెలిపింది.