: శాంసంగ్ గెలాక్సీ నోట్ - 4 ధర రూ.58,300
స్మార్ట్ ఫోన్ల రంగంలో పేరెన్నికగన్న శాంసంగ్, తన నూతన ఆవిష్కరణ శాంసంగ్ గెలాక్సీ నోట్ 4ను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. విశ్వవ్యాప్తంగా విడుదలైన నెల వ్యవధిలోనే శాంసంగ్ గెలాక్సీ నోట్ 4 భారత వినియోగదారులకు అందుబాటులోకి రావడం గమనార్హం. ఫ్యాబ్లెట్ తరహాకు చెందిన దీని ధరను రూ.58,300లు నిర్ణయించినట్లు శాంసంగ్ ప్రకటించింది. దీపావళి సందర్భాన్ని పురస్కరించుకుని విడుదలైన శాంసంగ్ గెలాక్సీ 4, ఇటీవలే భారత మార్కెట్ లోకి వచ్చిన ఐఫోన్ 6 ప్లస్ నుంచి భారీ పోటీని ఎదుర్కోనుంది.