: బోరుబావిలో చిక్కుకున్న గిరిజ మృతి
రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో రెండు రోజుల క్రితం బోరుబావిలో పడ్డ చిన్నారి గిరిజ మృతి చెందింది. గిరిజను కాపాడటానికి ఎన్డీఆర్ఎఫ్, మైన్స్ రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 45 అడుగుల లోతుకు గొయ్యి తవ్వి, 8 సిలిండర్ల ఆక్సిజన్ సరఫరా చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గిరిజ మృతితో మంచాల గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.