: ఆళ్లగడ్డకు నవంబర్ 8న పోలింగ్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 22న వాటిని పరిశీలిస్తారు. 24న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 8న ఆళ్లగడ్డలో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 12న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా ఆమె కుమార్తె అఖిల ప్రియ పోటీ చేస్తున్నారు.