: ర్యాగింగ్ చేసిన హౌస్ సర్జన్లు సస్పెన్షన్
అనంతపురం మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జూనియర్లను సీనియర్లు బట్టలిప్పించి డ్యాన్యులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ర్యాగింగ్ కు కారణంగా భావిస్తున్న నలుగురు హౌస్ సర్జన్లను ప్రిన్సిపల్ నీరజారెడ్డి సస్పెండ్ చేశారు. విచారణలో హౌస్ సర్జన్లు దోషులుగా తేలితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. జూనియర్ విద్యార్థుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ విచారణ చేపట్టారు.