: రూ.2.4 కోట్ల ఇసిస్ నిధుల పట్టివేత!
ఇరాక్, సిరియాల్లో మారణహోమం సృష్టిస్తున్న ఇసిస్ ఉగ్రవాదులకు చెందినవిగా భావిస్తున్న రూ.2.4 కోట్లను బ్రిటన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాంచెస్టర్ నుంచి టర్కీకి వెళుతున్న విమాన ప్రయాణికులను సోదా చేసిన పోలీసులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తున్న ఇసిస్ మిలిటెంట్లకు భారీ మొత్తంలో నిధులు అత్యవసరమవుతున్నాయి. టర్కీ వెళుతున్న విమాన ప్రయాణికుల ద్వారా మిలిటెంట్లు నిధులను సేకరిస్తున్నారన్న సమాచారంతోనే బ్రిటన్ పోలీసులు దాడి చేశారు.