: ఏపీకి టీఎస్ సర్కారు సాయం... ఐదుగురు ఐఏఎస్ ల కేటాయింపు
తుపానుతో అతలాకుతలమైన ఏపీని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తన వంతు సాయం చేస్తోంది. ఈ క్రమంలో, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తెలంగాణకు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను కేటాయించింది. ఏపీ తుపాను సహాయక కార్యక్రమాల్లో టీఎస్ ప్రభుత్వం పాలుపంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఐదుగురు ఐఏఎస్ అధికారుల్లో నీరబ్ కుమార్ ప్రసాద్, శ్రీనివాస్ శ్రీనరేష్, గిరిజా శంకర్, హరి జవహర్ లాల్, లక్ష్మీ కాంత్ ఉన్నారు. ఏపీ విపత్తు నివారణ కమిషనర్ తో సమన్వయం చేసుకుంటూ వీరు తుపాన్ సహాయక చర్యల్లో పాల్గొంటారని రాజీవ్ శర్మ తెలిపారు. వీరందరినీ ఏపీ సీఎస్ వద్ద రిపోర్టు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు.