: కేంద్రంలో జాతీయ భద్రతా సలహాదారుకు పెరుగుతున్న ప్రాధాన్యం


జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్రంలో మరింత కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ బృందంతో కలిసి వెళ్లిన దోవల్, ప్రధాని భారత్ వచ్చేసిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ దేశానికి చెందిన పలువురు పారిశ్రామిక దిగ్గజాలను కలిసి భారత్ లో వారి పెట్టుబడులకు సంబంధించిన చర్చలను పూర్తి చేసి మరీ వచ్చారు. నిఘా వ్యవహారాల్లో మంచి అనుభవం ఉన్న దోవల్ సేవలను సాధ్యమైనంత ఎక్కువగా వాడుకోవాలని తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రికి ప్రధాని నరేంద్ర మోడీ సూచించారట. దీంతో హోం శాఖలోనూ దోవల్ కీలక భూమిక పోషిస్తున్నారు. ఆ శాఖకు సంబంధించిన ప్రతి ముఖ్య సమావేశంలోనూ దోవల్ పాలుపంచుకుంటున్నారు. అంతేకాక ఇటీవల రాజ్ నాథ్ సింగ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న సమయంలో దోవల్, ఏకంగా ఆ శాఖ మంత్రి తరహాలోనే వ్యవహరించారట. ఇప్పటిదాకా జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న వ్యక్తి ఈ తరహాలో తమ శాఖ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్న దాఖలా లేదని సాక్షాత్తు హోం శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ గా దోవల్ పనిచేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News