: ఏపీ తుపాను బాధితులకు తెలంగాణ పీసీసీ సాయం


ఆంధ్రప్రదేశ్ లో హుదుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ పీసీసీ ముందుకొచ్చింది. ఈ మేరకు తుపాన్ తాకిడికి గురయిన ప్రాంతాలకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, హుదూద్ తుపాన్ ను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్డు, రవాణా వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వానికి పొన్నాల సూచించారు.

  • Loading...

More Telugu News