: సైబర్ స్పేస్ 'సంచలన సెలబ్రిటీ'గా యువ కథానాయిక


బాలీవుడ్ యువ కథానాయిక అలియా భట్ పాప్యులారిటీలో దూసుకుపోతోంది. తాజాగా సైబర్ స్పేస్ 'అత్యంత సంచలన సెలబ్రిటీ' జాబితాలో నిలిచింది. ఈ విషయాన్ని సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ మేకర్ మెకేఫీ తెలిపింది. తను నటించిన సినిమాలు, జోక్స్, అనుకరణతో జాతీయ వ్యాప్తంగా అలియా సంచలనం సృష్టించిందని, దాంతో తాము నిర్వహించిన సర్వేలో ఆమెనే పలువురు ఎన్నుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల కంటే ఈ భామ టాప్ లో చోటు సంపాదించినట్లు వెల్లడించింది. "నెట్ వినియోగదారుల అవసరాన్ని దోపిడీ చేసే విధానంలో పలువురు సెలబ్రీటీల వార్తలను సైబర్ క్రిమినల్స్ అప్ లోడ్ చేస్తుంటారు. ఇలాంటి లోపాలను, సమస్యలను హైలైట్ చేసేందుకు ఈ సర్వే బాగా ఉపయోపడింది. ప్రజల ఆకర్షణను క్యాష్ చేసుకుని పలు ఫోటోలను, వార్తలను క్రిమినల్స్ లోడ్ చేస్తుంటారు. దానివల్ల వినియోగదారుల పాస్ వర్డ్ లు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు" అని మెకేఫీ వివరించింది.

  • Loading...

More Telugu News