: విశాఖ వన్డే మ్యాచ్ రద్దు
ఊహించిందే జరిగింది. రేపు (మంగళవారం) విశాఖలో ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మూడో వన్డే హుదూద్ తుపాను కారణంగా రద్దైంది. తుపాను విలయంతో మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఏసీఏ-బీడీసీఏ స్టేడియం పూర్తి చిత్తడిగా మారింది. ఫీల్డ్ పై కప్పిన కవర్లు బలమైన గాలులకు కొట్టుకుపోయాయి. కనీసం, ఫీల్డ్ పరిస్థితి ఎలా ఉందో చూడటానికి కూడా బయటకు అడుగుపెట్టలేని స్థితి నెలకొందని ఏసీఏ అధికారి మోహన్ తెలిపారు. మ్యాచ్ జరగడానికి ఏమాత్రం అనుకూల పరిస్థితులు లేని కారణంగా, మూడో వన్డేను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.