: సహాయ చర్యలపై ఏపీ సీఎస్ తో మాట్లాడిన తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ
తుపాను బీభత్సం నేపథ్యంలో ఏపీ సర్కారుకు సహాయం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ముందుకు రావడం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో మాట్లాడారు. తుపాను సహాయక చర్యల్లో తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా రాజీవ్ శర్మ ఏపీ సీఎస్ కు తెలిపారు. దీనిపై ఏపీ సర్కారు స్పందన తెలియరాలేదు.