: విజయవాడ నుంచి రోడ్డు మార్గాన విశాఖకు చంద్రబాబు
హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల సందర్శనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరనున్నారు. బలమైన ఈదురు గాలుల నేపథ్యంలో నేరుగా విశాఖకు విమాన సర్వీసులు రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానం ద్వారా విజయవాడకు చేరుకోనున్న చంద్రబాబు, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారిన నేపథ్యంలో విశాఖ పర్యటనను రద్దు చేసుకోవాలన్న అధికారుల సూచనలను చంద్రబాబు తోసిపుచ్చినట్లు సమాచారం. కొద్దిసేపట్లో ఆయన విజయవాడకు బయలుదేరతారు.