: హుదూద్ సహాయక చర్యల్లో పాల్గొనండి: పార్టీ కార్యకర్తలకు జగన్ పిలుపు
హుదూద్ తుపాను సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో తుపాను తీవ్రతపై సమీక్షించిన ఆయన తుపాను నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావిత జిల్లాలకు చెందిన తన పార్టీ నేతలతో చర్చిస్తున్న ఆయన ఎప్పటికప్పుడు తుపాను ప్రభావంపై సమాచారం తెలుసుకుంటున్నారు. తుపానులో చిక్కుకున్న ప్రజలను కాపాడే విషయంలో వేగంగా స్పందించాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.