: వైజాగ్ వన్డేపై బ్రాడ్ కాస్టర్ల ఆందోళన


హుదూద్ తుపాను తీరం దాటడంతో విశాఖపట్నం భయం గుప్పిట్లో చిక్కుకుంది. ఉప్పెన అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించడమే అందుకు కారణం. కాగా, అక్టోబర్ 14న విశాఖలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. తుపాను కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది. హుదూద్ తీరం దాటినా, మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండడమే అందుకు కారణం. ఇప్పటికే విశాఖ ప్రాంతంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో విశాఖ వన్డేను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న బ్రాడ్ కాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ వెళ్ళడం సురక్షితం కాదని వారు భావిస్తున్నారు. వేదికను మార్చాలని ఆశిస్తున్నామని, అయితే, ఇంతవరకు ఏ విషయం తెలియరాలేదని చెప్పారు. దీనిపై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మాట్లాడుతూ, మ్యాచ్ వేదికను ఇప్పుడు తరలించడం చాలా కష్టమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News