: అనంతపురం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం!


కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ర్యాగింగ్ ఘటనల సంఖ్య తగ్గినప్పటికీ, అక్కడక్కడ వెలుగు చూస్తున్న ఘటనల తీవ్రత సమాజాన్ని కలవరానికి గురి చేస్తోంది. ఈ తరహా ఘటన శనివారం రాత్రి అనంతపురం మెడికల్ కళాశాలలో చోటుచేసుకుంది. వికృత పైత్యం తలకెక్కిన కొందరు సీనియర్ విద్యార్థులు, జూనియర్లపై దాడికి దిగారు. అంతకుముందు దుస్తులు విప్పి మరీ నృత్యాలు చేయాలంటూ వారు జారీ చేసిన ఆదేశాలను జూనియర్లు తిరస్కరించారు. దీంతో మరింత రెచ్చిపోయిన సీనియర్లు జూనియర్లపై దాడి చేసి బలవంతంగా వారి దుస్తులు విప్పదీయించి డ్యాన్సులు చేయించారు. అయితే సీనియర్ల దురాగతంపై మండిపడ్డ జూనియర్లు తమ సహచరులకు సమాచారం చేరవేశారు. అనంతరం జూనియర్లంతా కలిసి ర్యాగింగ్ కు పాల్పడ్డ నలుగురు సీనియర్లను అదుపులోకి తీసుకుని కళాశాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్న కళాశాల ఉన్నతాధికారులు సీనియర్లు, జూనియర్ల మధ్యన రాజీ కుదిర్చే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ర్యాగింగ్ పై ఇప్పటిదాకా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News