: నా తల్లి మరణంపై దర్యాప్తు పూర్తి చేయండి: సునంద పుష్కర్ కుమారుడు శివ్
తన తల్లి మరణంపై వెల్లువెత్తుతున్న వివిధ రకాల ఊహాగానాలపై సునంద పుష్కర్ కొడుకు శివ్ పుష్కర్ మీనన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఊహాగానాలకు వెంటనే తెరదించాలని అతడు ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం దుబాయిలో ఉన్న శివ్, ఢిల్లీ పోలీసులకు ఓ లేఖ రాశాడు. తన తల్లి సునంద పుష్కర్ మరణం వెనుక దాగి ఉన్న వాస్తవాలను వీలయినంత త్వరలో వెల్లడి చేయాలని, ఇందులో ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా వ్యవహరించాలని కూడా అతడు పోలీసులను కోరాడు. ఇప్పటికే తల్లి మరణంతో తీవ్ర విచారంలో కూరుకుపోయిన తమను, తల్లి మరణంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఊహాగానాలు మరింత కుంగదీస్తున్నాయని అతడు వాపోయాడు.