: ఉత్తర దిశగా కదులుతోన్న హుదూద్... 180 కి.మీ. వేగంతో గాలులు


భీమిలి-కైలాసగిరి మధ్య తీరం దాటిన హుదూద్ ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతోంది. మరో గంటలో ఇది తీరాన్ని దాటనుంది. ప్రస్తుతం గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అయితే, తీరం దాటే సమయంలో కాసేపు ప్రశాతంగా ఉండి... అనంతరం భీకర గాలులతో బెంబేలెత్తిస్తుంది. గాలి వేగం గంటకు 200 కిలోమీటర్లు కూడా దాటే అవకాశం ఉంది. విశాఖ దక్షిణ ప్రాంతంలో ఉప్పెన విరుచుకుపడే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో ఎక్కడ చూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.

  • Loading...

More Telugu News