: ధూల్ పేటలో కార్డ్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు
ధూల్ పేట... హైదరాబాద్ లో వెరీ ఫేమస్. గుడుంబా తయారీ అనేది ఈ ప్రాంతంలో కుటుంబ పరిశ్రమగా వర్ధిల్లుతుంటుంది. అలాంటి ధూల్ పేటలో నిన్న రాత్రి పోలీసులు కార్డ్ అండ్ సర్చ్ తనిఖీలు నిర్వహించారు. 25 గుడుంబా బట్టీలను ధ్వంసం చేశారు. 25 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికితోడు, అక్రమంగా నిలువ ఉంచిన వందకు పైగా అక్రమ సిలిండర్లను స్వాధీనపరుచుకున్నారు.