: 18 ఏళ్ల తర్వాత విశాఖపై తుపాను పంజా


విశాఖ వైపు హుదూద్ తుపాను దూసుకువస్తోంది. ప్రస్తుతం ఇది ఉక్కు నగరానికి ఆగ్నేయ దిశలో 100 కిలోమీటర్ల దూరం వరకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఇది తీరం దాటనుంది. దీని ప్రభావంతో గత రాత్రి విశాఖ తీరంలో 100 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయి. విశాఖ నగరంపై హుదూద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 18 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉక్కు నగరంపై పంజా విసురుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు సముద్ర తీరంలో ఉండకుండా పోలీసులు, అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News