: మహారాష్ట్ర ఎన్నికల బరిలో ఎంఐఎం... ముంబైలో 12 సీట్లలో పోటీ


హైదరాబాద్ పాతబస్తీలో సుదీర్ఘకాలంగా పట్టు కొనసాగిస్తూ వస్తున్న ‘ద ఆల్ ఇండియన్ మజ్లిస్ -ఏ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్' (ఎంఐఎం) తాజాగా మహారాష్ట్ర ఎన్నికల బరిలో దిగింది. ఆ రాష్ట్రంలో తొలిసారి పోటీ చేస్తున్న ఎంఐఎం మొత్తం 23 స్థానాల్లో పోటీకి దిగుతోంది. వీటిలో ముంబైకి చెందినవే 12 సీట్లు ఉండటం గమనార్హం. ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను నిలిపిన ఎంఐఎం, వారి తరఫున ప్రచారం కోసం పార్టీ కీలక నేత అక్బరుద్దీన్ ఒవైసీని పంపింది. ముంబైతో పాటు థానే తదితర ప్రాంతాల్లో అక్బరుద్దీన్ నిర్వహించిన ప్రచారానికి భారీ స్పందనే లభించింది. ‘‘సొంత రాష్ట్రంలో మేము సంతోషంగానే ఉన్నాం. అయితే మీరు మీ రాష్ట్రంలో ఇలాంటి దుర్భర స్థితిలో ఉండటం మమ్మల్ని కలచివేస్తోంది. మీ హక్కుల పరిరక్షణ కోసమే వచ్చాం’’ అంటూ అక్బరుద్దీన్ చేసిన ప్రసంగం, అక్కడి మైనార్టీ వర్గాలను బాగానే ఆకట్టుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్ మున్సిపాలిటీలో 13 వార్డులను గెలుచుకున్న ఎంఐఎం, తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధించే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News