: ఈ క్యాన్సర్ ఇరవై ఏళ్ళ వరకు నిద్రాణంగా ఉండగలదట!


క్యాన్సర్ ఏ అవయవానికి సోకినా ప్రాణాంతకమే. ప్రాథమిక దశలో గుర్తించకపోతే ప్రాణంపై ఆశలు వదులుకోకతప్పదు. ఇటీవలే యూకేలోని క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ చేపట్టిన అధ్యయనం ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్ 20 సంవత్సరాలకు పైగా నిద్రాణంగా ఉండగలదట. అనంతరం ఒక్కసారిగా విరుచుకుపడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఇందుకోసం వారు ఏడుగురు రోగులపై పరిశోధనలు చేపట్టారు. వారిలో పొగ తాగుతున్నవారు, పొగతాగడం మానేసినవాళ్ళు, ఎన్నడూ పొగతాగని వాళ్ళు ఉన్నారు. జన్యు లోపాల కారణంగా ఈ క్యాన్సర్ సోకిన తర్వాత, ఏళ్ళ తరబడి దాన్ని గుర్తించలేమని, వ్యసనాల కారణంగా ఒక్కసారిగా అది విశ్వరూపం ప్రదర్శిస్తుందని అధ్యయనం చెబుతోంది. తమ పరిశోధన లంగ్ క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ తరహా క్యాన్సర్ ను బాగా ముదిరిన తర్వాతే కనుగొంటుండటంతో, ప్రాణాలు కాపాడేందుకు అవకాశాలు స్వల్పంగానే ఉంటున్నాయి.

  • Loading...

More Telugu News