: సినిమాల కంటే రాజకీయాలే ముఖ్యం: రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్
నటన కంటే రాజకీయాలకే ప్రాధాన్యమిస్తానని 'మిలేనా మిలేహం' సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఎంపీ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. నటన అనేది ఒక అంశానికి సంబంధించినదని, నటనపై ఉన్న మక్కువతోనే ఆ కోరిక నెరవేర్చుకున్నానని తెలిపారు. ఇప్పుడు పూర్తి స్పష్టతతో ఉన్నానని, తనకు రాజకీయాలే సరైన వేదిక అని ఆయన పేర్కొన్నారు. చివరి వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జమాయి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించిన చిరాగ్ పాశ్వాన్, లోక్ జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు.