: వాద్రా భూవివాదంలో ‘కోడ్’ ఉల్లంఘనేమీ లేదు: ఎన్నికల సంఘం
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వివాదంలో హర్యానా ప్రభుత్వం ఎన్నికల నియమావళికి ఎలాంటి భంగం కలిగించలేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణల్లో పసలేదని చెప్పింది. మూడు రోజుల క్రితం హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా... వాద్రాకు హర్యానా భూకేటాయింపుల అంశాన్ని ప్రధాని మోడీ లేవనెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాద్రాకు ఎలాంటి భూ కేటాయింపులు ఉండబోవన్న విషయాన్ని తెలుసుకున్న హర్యానా ప్రభుత్వం హడావిడిగా వాద్రాకు భూములను కేటాయించిందని మోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ భూ కేటాయింపులను పరిశీలించి ఎన్నికల సంఘం హర్యానా ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం... హర్యానా భూకేటాయింపుల్లో ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది.