: నేడు హైదరాబాద్ విచ్చేస్తున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు హైదరాబాద్ విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మెట్రోపొలిస్ సదస్సు జరుగుతున్న హెచ్ఐసీసీకి చేరుకుంటారు. మేయర్ల సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ఢిల్లీ తిరిగి వెళతారు. ఆయన రాక సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్, హైటెక్ సిటీ, టీసీఎస్, కొత్తగూడ 100 ఫీట్ రోడ్, బొటానికల్ గార్డెన్స్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తారు.