: ఒడిశా రెడీ...మరి ఏపీ?


హదూద్ తుపాను ముప్పు ముంచుకొస్తోంది. రానున్న 24 గంటల్లో భారీ తుపానుగా మారనుందని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరిస్తోంది. దీంతో ఒడిశా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గంజాం జిల్లాలో తుపాను ప్రభావం పడే ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 45 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒడిశాలోని తుపాను ప్రభావిత జిల్లాలకు తరలివెళ్తున్నాయి. అధికారులకు సెలవులు రద్దు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఒడిశా ప్రభుత్వం సూచించింది. 16 జిల్లాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని సూచించింది. కాగా, ఆంధ్రప్రదేశ్ లోని వంశధార, నాగావళి నదులకు వరదల తాకిడి అధికంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం భారీగా పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడుజిల్లాల్లో మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని సూచించింది.

  • Loading...

More Telugu News