: కొత్తగా ఏర్పడబోయే జిల్లాకు కొమరం భీం పేరు: కేసీఆర్
ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు కొమరం భీం వర్థంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా జోడుఘాట్ లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించి అందులో ఓ జిల్లాకు ఆయన పేరు పెడతామని చెప్పారు. గిరిజన యూనివర్సిటీకి కూడా ఆయన పేరే పెడతామని తెలిపారు. అంతేకాకుండా, ఆయన కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం కూడా చేస్తామని ప్రకటించారు. దాంతో పాటు ఆయన మనవడు, మనవరాలికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.