: చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోండి... భారత్-పాక్ కు ఐరాస సూచన
వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన తీవ్రతరమైన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రెటరీ బాన్ కీ మూన్ స్పందించారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలను, సమస్యలను చర్చల ద్వారా భారత్, పాకిస్థాన్ పరిష్కరించుకోవాలని ఆయన కోరినట్లు అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజర్రిక్ తెలిపారు. గత రాత్రి నుంచి జమ్మూ సరిహద్దులోని పూంచ్ జిల్లాలో ఉన్న 40 బోర్డర్ అవుట్ పోస్టులు, 25 బోర్డర్ గ్రామాల వద్ద పాక్ సైన్యం కాల్పులు జరుపుతూనే ఉంది. దాంతో, ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది.