: సిల్వర్ స్క్రీన్ కు హాకీ లెజెండ్ జీవితం


హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ జీవితంపై చిత్రం రూపొందించేందుకు బాలీవుడ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇందుకు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఆయనకు నివాళిగా జీవిత చరిత్రను తెరకెక్కించనున్నట్లు కరణ్ తెలిపాడు. "నా స్నేహితులు పూజా, ఆర్తీ శెట్టీ, నేను... లెజండరీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ కథ రైట్స్ పొందినందుకు చాలా గర్వంగా ఉంది" అని కరణ్ ట్వీట్ చేశాడు. అటు ఇదే విషయాన్ని ఫేస్ బుక్ లోనూ తెలిపాడు. ధ్యాన్ చంద్ 1928, 32, 36లో ఒలింపిక్స్ లో భారత్ కు మూడు గోల్డ్ మెడల్స్ తెచ్చిపెట్టారు.

  • Loading...

More Telugu News